• Home
  • Trending Today
  • లేడీ డైరెక్టర్ పై పరువు నష్టం దావా
Trending Today సినిమా వార్తలు

లేడీ డైరెక్టర్ పై పరువు నష్టం దావా

#MeToo Susi Ganesan Harassed Leena Manimekalai

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం చెలరేగిపోతుంది… మొదట హాలీవుడ్ లో పుట్టిన మీటూ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లను తాకింది… ప్రముఖ రచయిత, లఘు చిత్రాల దర్శకురాలు లీనా మణిమేగలై, తిరుట్టుపయలే, కందసామి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరక్టర్ సుశీ గణేషన్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలపై స్పందించిన సుశీ గణేశన్… లీనా కావాలనే ఇదంతా చేస్తుందని ఆమె ఆరోపణలను ఖండించారు. ఈ విషయంలో హీరో సిద్ధార్థ్ లీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో సుశీ గనేషన్ అతడిని బెదిరించాడు. సిద్ధార్థ్ ఈ విషయాన్ని కూడా వెల్లడిస్తూ సుశీ గణేశన్ గురించి ఇప్పటికైనా తెలుసుకోండి అంటూ ట్వీట్ చేశాడు.

తన ఇమేజ్ కి డ్యామేజ్ జరగడంతో సుశీ గణేశన్ ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు. తన పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తుండం సెయింట్ థామస్ మౌంట్ అసిస్టెంట్ కమీషనర్ కి దర్శకురాలు లీనా మణిమేకలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తోన్న లీనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది.

Related posts

అంతా త్రివిక్రమే చేశాడు…కొండంతబలం మీరే..ధన్యవాదాలు… : తారక్

chandra sekkhar

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అఖిల్

admin

నాని "కృషార్జునయుద్ధం" టీజర్ ..?

admin

Leave a Comment