telugu navyamedia
telugu cinema news

పెళ్లిపై స్టార్ హీరోయిన్ కామెంట్స్… ఫైర్ అవుతున్న నెటిజన్లు

Sushmitha-Sen

అందాల సుందరి సుష్మితాసేన్ గత కొంతకాలంగా ఓ మోడల్ రోహామాన్ షాల్ తో డేటింగ్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సుష్మితా కంటే షాల్ పదిహేనేళ్లు చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తుండడంతో వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ జంట పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తన పెళ్లిపై స్పందిస్తూ సుష్మిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ”ఈ పెళ్లిళ్ళను ఎవరు కనిపెట్టారో… నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానంటే… నువ్వు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూస్తాను” అంటూ తన ప్రేమికుడిపై ప్రేమను వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పెళ్లి గురించి సుష్మితా చేసిన ఈ పోస్ట్ జనాల్లో తప్పుడు అభిప్రాయాలను కలిగించేలా ఉందని మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై సుష్మితాసేన్ ఏమంటుందో చూడాలి. ప్రస్తుతం సుస్మితాసేన్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వాళ్ల బాధ్యతలను చూసుకుంటుంది.

Related posts

వింక్ గర్ల్ తో నితిన్ ?

vimala p

వైమానిక యోధురాలిగా జాన్వీ కపూర్

vimala p

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో – 2 ..!

vimala p