telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైరల్ వీడియో : ప్రియుడితో కలిసి సుష్మితాసేన్ హాట్ వర్కవుట్స్

Sushmitasen-and-rohman

అందాల సుందరి సుష్మితాసేన్ గత కొంతకాలంగా ఓ మోడల్ రోహామాన్ షాల్ తో డేటింగ్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సుష్మితా కంటే షాల్ పదిహేనేళ్లు చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తుండడంతో వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి కపుల్ వర్కవుట్స్ చేసిన వీడియోని సుష్మితాసేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు అని గట్టిగా ఓ హగ్ ఇచ్చి మరీ విషెస్ చెప్పిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఈ ఏడాదిలో ఈ జంట పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమన్నదాంట్లో స్పష్టత లేదు. ప్రస్తుతం సుస్మితాసేన్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వాళ్ల బాధ్యతలను చూసుకుంటుంది.

Related posts