telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకంటే 15 ఏళ్లు చిన్నవాడు… నేను ఆశ్చర్యపోయా… : సుష్మితాసేన్

Sushmitha Sen

గత కొంత కాలంగా సుస్మితా సేన్… తన బాయ్ ఫ్రెండ్‌ రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సుస్మితా ఎక్కడికి వెళ్లిన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసే దర్శనమిస్తోంది.సుస్మితా సేన్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. ప్రైవేట్ లైఫ్ గురించి కూడా పబ్లిక్ గానే చెబుతుంది. రోహ్మాన్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోల్ని సోషల్‌మీడియా ద్వారా తరచుగా అభిమానులతో పంచుకుంటుంది సుస్మితాసేన్‌. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహ్మాన్‌షాల్‌ తనకంటే 15 ఏళ్లు చిన్నవాడని చెప్పి అందరిని ఆశ్చర్యపరచింది సుస్మితాసేన్‌. ‘ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రోహ్మాన్‌ నాకు పరిచయమయ్యాడు. కొద్దికాలంలోనే ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. వయసు గురించి అతన్ని ఎప్పుడు అడిగినా సమాధానం దాటవేసేవాడు. ఓ రోజు తన వయసు గురించి నిజం చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. నాకంటే 15ఏళ్లు చిన్నవాడని తెలిసి ఆశ్చర్యపోయా. అయితే వయసు మా అనుబంధాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదని తెలుసుకున్నాం. మా ఇద్దరిది విధి కలిపిన ప్రేమకథ’ అని చెప్పింది.

Related posts