telugu navyamedia
andhra political trending

నేను గవర్నర్ ని కాదు బాబు…! సుష్మా

sushma on governor for telugu state

గవర్నర్ విషయంలో ఏపీ గురించి కొత్త ప్రచారం మొదలైంది.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ లను కేంద్రం నియమిస్తున్నట్టు ఆ వార్త సారాంశం. అంతటితో ఆగకుండా, సుష్మా ఒక తెలుగు రాష్ట్రానికి గవర్నర్ అని ప్రచారం మొదలైంది. దీనిపై సుష్మా స్వరాజ్ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియామకం కానున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తవమని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార ట్విట్టర్ లో తెలిపారు. వాస్తవానికి తొలుత కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. సుష్మా స్వరాజ్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడంతో ఆమె ఏపీకి గవర్నర్‌గా నియమితులయ్యారని అంతా అనుకున్నారు.

ఇంతలోనే అది ఫేక్ వార్త అని తెలుసుకుని తన ట్వీట్‌ను డిలీట్ చేశారు హర్షవర్ధన్. ఆ తర్వాత కాసేపటికే సుష్మా స్వరాజ్ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని తేల్చారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీనితో తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఏపీకి గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని వార్తలు వచ్చాయి.

Related posts

హైదరాబాద్ పావురాళ్లను .. అడవులకు తరలింపు ..

vimala p

శృంగారం కావాలన్నాడు… అందుకే ఇంటిని తగల బెట్టేసింది

vimala p

క్రిస్మస్ లో … స్టార్ కు ఉన్న ప్రాధాన్యత తెలుసా..

vimala p