telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో

Allu-Arjun

బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా ఈరోజునే పూజాకార్యక్రమాలతో పట్టాలెక్కింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో అక్కినేని హీరోతో పాటుగా మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున మేనల్లుడు సుశాంత్ కాగా, మరొకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ సరైన హిట్ పడలేదు. ఇక నవదీప్ కు కూడా బ్లాక్ బస్టర్ హిట్ రానేలేదు. ఇప్పుడు నవదీప్ కు అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి ఈ హీరోలిద్దరకీ ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. ఇక నవదీప్ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి వుంది. మరి ఈ ఇద్దరికీ ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందో చూడాల్సిందే. ఇక మిగతా పాత్రల్లో రాజేంద్రప్రసాద్, సునీల్, రావు రమేశ్ తదితరులు కనిపించనున్నారట.

Related posts