telugu navyamedia
సినిమా వార్తలు

“సూర్యకాంతం” ట్రైలర్

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం “సూర్య‌కాంతం”. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. ఈ వేడుకకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా రావడంతో సినిమాకు హైప్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సూర్యకాంతం” చిత్రం మార్చి 29న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఇద్దరు యువతుల ప్రేమ మధ్యలో నలిగిపోయే యువకుడి కథే “సూర్యకాంతం” అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు పంపిణీ చేస్తుండటం సినిమాకు కలిసొచ్చే విషయం. శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మరి ఈ చిత్రమైనా మెగా హీరోయిన్ నిహారికకు మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

Related posts