telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

జల్లికట్టు నేపథ్యంలో.. సూర్య వాడివాసల్‌ చిత్రం..

Surya

ఇటీవల తెరకెక్కిన ‘ఎన్‌జీకే’, ‘కాప్పాన్‌’ చిత్రాలు సూర్యకు ఆశించిన విజయాన్ని అందించలేక పోయాయి. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఆయన నటించిన ‘సూరరై పోట్రు’ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుంది. దీని తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ‘వాడివాసల్‌’ అని పేరు పెట్టారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వెట్రిమారన్‌ నవలల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ‘వెక్కై’ అనే నవల ఆధారంగానే ‘అసురన్‌’ను తెరకెక్కించి హిట్‌ చిత్రంగా మలిచారు.

నవల ఆధారంగా ‘వాడివాసల్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. జల్లికట్టు పోటీల్లో ఎద్దులు దూసుకొచ్చే ద్వారాన్నే ‘వాడివాసల్‌’ అని తమిళంలో అంటారు. సీఎస్‌ చెల్లప్ప రాసిన ఓ నవల ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. సూర్య, వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం సూరి హీరోగా ఓ సినిమాను చిత్రీకరిస్తున్నారు వెట్రిమారన్‌. అది పూర్తయిన తర్వాత సూర్య చిత్రం మొదలుకానుంది.

Related posts