• Home
  • Trending Today
  • సూర్యను వదిలిపెట్టనంటున్న తమిళ దర్శకుడు
Trending Today సినిమా వార్తలు

సూర్యను వదిలిపెట్టనంటున్న తమిళ దర్శకుడు

surya

తమిళ డైరెక్టర్ హరి, సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఆరు, సింగం, సింగం2, సింగం3 ఈ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఒకవైపు సినీ వర్గాల్లో, మరోవైపు అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అయితే హరి, సూర్య యాక్షన్ కూడా సరిగ్గా వారి అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయి. తాజాగా ఈ హిట్ కాంబినేషన్ మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది.

ఇటీవలే విక్రమ్ తో “స్వామి” సీక్వెల్ తెరకెక్కించారు హరి. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత హిట్ సాధించలేకపోయింది. ప్రేక్షకుల నుంచి విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇక ప్రస్తుతం హరి, సూర్య కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేసాడట. ఇటీవలే సూర్యకు స్క్రిప్ట్ వినిపించగా సూర్య కథ విని, ఎంతో థ్రిల్ అయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .

Related posts

‘మెహబూబా’ లో పాట…?

admin

ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎందుకు షాకిచ్చాడో తెలుసా!

madhu

ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న యంగ్ హీరోయిన్ ?

vimala t

Leave a Comment