telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్ రేసులో సూర్య మూవీ..

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసినా ప్రజాదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ సినిమా తెలుగులోనూ బంపర్‌ హిట్‌ కొట్టింది. ప్రతి భాషలోనూ అందరినీ కట్టిపడేసింది. నిజ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ పోటీలను నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఆస్కార్ పోటీలో పాల్గొనేందుకు సిద్దమయింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ఈ మూడు విభాగాల్లో నామినేట్ అయింది. ఆస్కార్‌కి నామినేట్ అయిన 366 సినిమాల్లో సూరారై పోట్రు కూడా ఒకటని సూర్య ట్వీట్ చేశారు.

Related posts