telugu navyamedia
telugu cinema news

సూర్య “కాప్పన్” విడుదల తేదీ మారింది… కారణం ప్రభాస్…!?

surya gold gift to unit

నటుడు సూర్య జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన నుంచి అభిమానులు ఆశించే యాక్షన్, ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి “ఎన్జీకే” సిద్ధమవుతోంది. తరువాత సినిమాగా “కాప్పన్” షూటింగు చాలా వరకు పూర్తయ్యింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యతో పాటు కొత్తగా పెళ్ళి చేసుకున్న బ్యూటిఫుల్ కపుల్ ఆర్య, సాయేషా సైగల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజకీయ నాయకుడిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు చిత్రబృందం. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టుగా సూర్య ప్రకటించాడు. తాజాగా ఆగస్టు 30న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని మార్చుకోవడానికి ప్రభాస్ “సాహో”నే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “సాహో” తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 15న విడుదల కానుంది. అందుకే “కాప్పాన్” విడుదల తేదీని ఆగస్టు 15 నుంచి 30కి వాయిదా వేశారని అంటున్నారు.

Related posts

చిలిపి కళ్ళు…

vimala p

సినిమాలకు గుడ్‌బై చెపుతున్నా .. కమలహాసన్

ashok

“కెఎస్100” టైటిల్ లోగో…

vimala p