telugu navyamedia
సినిమా వార్తలు

సూర్య కటౌట్ కూల్చివేత… కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం

Surya

ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “ఎన్.జి.కే” చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా తిరుత్తణిలో 215 అడుగుల భారీ కటౌట్‌ ని ఏర్పాటు చేయగా అది అందరిని ఆకర్షించింది. అయితే అనుమతి లేకుండా ఆ స్థాయిలో కటౌట్ ని ఏర్పాటు చేశారని స్థానిక మున్సిపల్ అధికారులు కటౌట్ ని కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు మున్సిపల్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కార్యాలయాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.

Related posts