telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టేజ్ పై భావోద్వేగానికి గురైన సూర్య… వీడియో వైరల్

Suriya

త‌మిళ స్టార్ హీరో సూర్య రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే. ఎన్నో సామాజిక సేవ‌లు చేస్తూ ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా ఉంటారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా ఎందరికో అండ‌గా నిలిచాడు. తాజాగా అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సెంగొట్టెయాన్‌ చీఫ్‌, సూర్య గెస్ట్‌‌లుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓ యువతి ప్రసంగానికి చలించిపోయిన సూర్య వెక్కి వెక్కి ఏడ్చాడు. తండ్రి చనిపోయాక‌, కూలి ప‌ని చేసుకుంటూ త‌ల్లికి సాయ‌ప‌డ్డాను. చ‌దువుకోడానికి చాలా క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో సూర్య నాకు ఎంతో సాయం చేశారు. ఈ స్థితిలో ఉండ‌డానికి కార‌ణం ఆయ‌నే అంటూ ఆ యువ‌తి క‌న్నీరు పెట్టింది. యువ‌తి బాధ‌లు విన్న సూర్య కూడా భావోద్వేగానికి గురై క‌న్నీరు పెట్టుకున్నారు.

Related posts