telugu navyamedia
సినిమా వార్తలు

సూర్య తదుపరి చిత్రం టైటిల్ పోస్టర్

Surya

నటుడు సూర్య జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన నుంచి అభిమానులు ఆశించే యాక్షన్, ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి “ఎన్జీకే” సిద్ధమవుతోంది. తరువాత సినిమాగా “కాప్పన్” షూటింగు అప్పుడే ప్రారంభం అయ్యింది. ఆగస్టు 30న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకురాలు సుధ కొంగరకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘గురు’ సినిమాతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె, సూర్యతో సినిమాకి సన్నాహాలు చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి “సూరారై పొట్రు” అనే టైటిల్ ఖరారు చేసి, టైటిల్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా ‘అపర్ణ బాలమురళి’ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి సూర్య విసుగు, విరామం లేకుండా వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తూనే వున్నాడు.

Related posts