telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

తమ అదుపులో ఉన్నది ఇద్దరు కాదు ఒక్కరే: పాక్

Surgical Strike 2Pakistan Indian air space

పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయు సేన మెరుపు దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. భారత్‌ వైమానిక దాడులతో ఉగ్రవాదుల స్టావరాలను ధ్వంసం చేయడంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఏకంగా భారత గగనతలంలోకి యుద్ధవిమానాలను పాక్ తరలించింది. అప్రమత్తంగా ఉన్న భారత వాయు సేనా పాక్‌ యుద్ధ విమానాలను వెంబడించి తరిమికొట్టాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం పాక్‌లో కూలిపోయింది. భారత పైలట్‌ అభినందన్‌ను పాక్‌ సైన్యం సజీవంగా బంధించింది. పట్టుబడిన భారత్‌ పైలట్‌ కెప్టెన్‌ అభినందన్‌పై పాక్‌ సైనికులు విచక్షణారహితంగా దాడి చేశారు. యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందాన్ని పాక్‌ సైనికులు ఉల్లంఘించారు.

మరో వైపు ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్‌ మాట మార్చింది. తమ అదుపులో ఉన్నది ఇద్దరు కాదు ఒక్కరేనని స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన పైలట్‌ ఒక్కరే తమ కస్టడీలో ఉన్నారని పాకిస్థాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు తమ అధికారి పట్ల పాక్‌ సైన్యం వ్యవహరించిన తీరుపై భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Related posts