telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఎంఎస్ ఎక్సెల్‌.. సర్ఫ్‌ఎక్సెల్ మధ్య సమస్య!

surf excel ms excel Advertising confusion

రాబోయే హోలీ పండగను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సర్ఫ్ ఎక్సెల్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. మత సామరస్యానికి ఈ ప్రకటన ప్రతీక అంటూ సర్ప్ ఎక్సెల్ చెప్పుకున్నప్పటికీ విమర్శలు ఎదురవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఈ ప్రకటన విజయవంతమైంది. మరోవైపు సర్ఫ్ ఎక్సెల్ ఉత్పాదక సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. సర్ఫ్ ఎక్సెల్‌ను బాయ్‌కట్ చేయాలంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ ప్రకటన కారణంగా మరో సమస్య తలెత్తింది. కొంతమంది నెటిజన్లు సర్ఫ్‌ఎక్సెల్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ను కూడా బాయ్‌కట్ చేసేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఎంఎస్ ఎక్సెల్ మొబైల్ వెర్షన్ ఉంది. దీనిలో చాలామంది రివ్వ్యూ విభాగంలో ఎంఎస్ ఎక్సెల్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడతున్నారు. అంతేకాకుండా ఎంఎస్ ఎక్సెల్‌కు సింగిల్ స్టార్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. ఈ కరమంలో సర్ఫ్ ఎక్సెల్ తో ఎంఎస్ ఎక్సెల్ కు నష్టం వాటిల్లుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts