telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఇంగ్లీషు రావాలి: మంత్రి సురేశ్

suresh adimulapu minister

పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఇంగ్లీషు రావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఇంగ్లీషు భాషపై పట్టులేక ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. అందుకే, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, అమ్మఒడి పథకం ద్వారా పేదలను విద్యకు దగ్గర చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ గురించి ఆయన ప్రస్తావించారు. రాధాకృష్ణ రాతలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మతం పేరిట దుష్ప్రచారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related posts