telugu navyamedia
సినిమా వార్తలు

రానా కంటి సమస్య… నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు

Rana

“బాహుబలి” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా. అయితే రానాకు కంటి సమస్య ఉందనే విషయం తెలిసిందే. తాజాగా రానాకి ఒక కన్ను కనిపించదు. ఈ విషయాన్ని ఆయన ఓ టీవీ షోలో తెలిపారు. రానాకు చిన్నప్పుడే కంటి సమస్య వస్తే, కన్ను తీసేసి మరోకన్ను పెట్టారట. అయితే ఆ కంటికి చూపు మాత్రం లేదు. రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాత్లాడుతూ తన కొడుకును స్పోర్ట్స్ మ్యాన్ ను చేయాలని సురేష్ బాబు అనుకున్నారట. కానీ అది సాధ్యం కాలేదని అన్నారు. ఈ క్రమంలో ముందుగా రానాను ఆర్చరీలో చేర్చగా.. అతడు బాణాన్ని గురిచూసి కొట్టలేకపోయాడని, సురేష్ బాబు చెప్పారు. ఆ తరువాత క్రికెట్ లో చేర్పిస్తే.. బంతిని క్యాచ్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడని, కొన్ని పరీక్షలు చేయిస్తే అతడికి కంటి సమస్య ఉందని వైద్యులు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. దీంతో రానాని క్రీడల్లోకి పంపే ఆలోచన మానుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత రానా సినిమాలపై ఆసక్తి పెంచుకొని ఈ రంగంవైపు వచ్చినట్లు తెలిపారు. కానీ రానాకి క్రికెట్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టమని అన్నారు. ఈ కంటి సమస్య కారణంగా రానా ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని సమాచారం.

Related posts