telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ ని వీధికుక్కతో పోల్చిన సురేఖావాణి

surekhavani

నటి సురేఖావాణి ఫ్యామిలీ పాత్రల్లో దాదాపు అగ్రహీరోలందరి సినిమాల్లోనూ కనిపించారు. గ్లామరస్ పాత్రలకు సురేఖా దూరం అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. దీంతో ఆమెపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆమె కూతురితో కలిసి ఫొటోలు దిగి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇవి చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖాతో పాటు ఆమె కూతురు చిట్టి, పొట్టి డ్రస్సులు దిగి ఫొటోలకు ఫోజులివ్వడాన్ని ఓ నెటిజన్ తప్పుబట్టారు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే సురేఖా ఇలాంటివి ప్రోత్సహించడంపై నెగిటివ్ కామెంట్ చేశారు. ఒక కూతురిని ఇలా పెంచకూడదని పేర్కొన్నాడు. ఈ కామెంట్లు చూసిన సురేఖావాణి.. నెటిజన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుక్కతో పోలుస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. ‘‘నీ కంటే వీధి కుక్కలు లైఫ్‌ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజన్‌కు సురేఖ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు

Related posts