telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ రైతుల ఆందోళన పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…

court

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు, వ్యవసాయ చట్టాల రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రహదారులపై రైతుల బైఠాయుంపులు, ఆందోళనలు, వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్నారు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. ఢిల్లీ సరిహద్దుల్లో ప్రధాన రహదారుల దిగ్బంధం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయ విద్యార్థి రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ పై నేడు విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ ఎ ఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ జరపనుంది. పెద్ద సంఖ్యలో రైతుల నిరసనలు కారణంగా “కోవిడ్ -19” కేసుల సంఖ్య పెరగడానికి దారితీస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు పిటిషనర్ రిషబ్ శర్మ. బురారీలోని నిరంకారి మైదానంలో రైతులు శాంతియుతంగా నిరసన తెలపడానికి స్థలం కేటాయించినా రైతులు నిరాకరించారని, ఢిల్లీ సరిహద్దులను అడ్డుకుంటున్నారని “కరోనా” ముగిసిన తరువాత రైతులు నిరసనలను శాంతియుతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు పిటిషనర్ రిషబ్ శర్మ. రైతులతో చర్చలు,రైతు నేతల డిమాండ్లతో సహా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, ప్రభుత్వ ప్రతిపాదనలను కోర్టుకు వినిపించనుంది కేంద్రం. గత విచారణ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారానికి “ప్రత్యేక కమిటీ” వేస్తామన్న సుప్రీంకోర్టు. వ్యవసాయ చట్టాలు రద్దు సాధ్యం కాదని, సవరణలు చేస్తామని, పంట ఉత్పత్తులకు “కనీస మద్దతు ధర” కోసం చట్టబద్దత సాధ్యం కాదంటున్న కేంద్రం. 47 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమం. ఇప్పటికే 8 విడతలుగా రైతులతో చర్చలు జరిపింది కేంద్రం. చట్టాల రద్దు, ఇతర రైతు డిమాండ్లు సాధ్యం కావని, సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని రైతు నేతలకు కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Related posts