telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలి: సుప్రీంకోర్టు

supreme court two children petition
వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కేసు పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరపాలని పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న ఈసీ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది. 
విపక్షాలతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్, ఈ మేరకు తీర్పిచ్చింది. కనీసం సగం వీవీ ప్యాట్ లను లెక్కించాలని విపక్షాలు వాదించగా, అలా చేస్తే, ఫలితాల వెల్లడికి ఐదు రోజుల సమయం వరకూ పడుతుందని ఈసీ, అందుకు సమ్మతమేనని విపక్షాలు నిన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. దేశంలోని 21 పార్టీలు వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంను ఆశ్రయించాయి. వాదనలు పూర్తయిన తరువాత అత్యున్నత ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. 

Related posts