telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ మృతి కేసును సిబిఐకి అప్పగించాలన్న సుప్రీమ్ కోర్టు

Sushanth

జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లో సుశాంత్ తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు బీహార్, మహారాష్ట్ర మధ్య వివాదంగా మారింది. సీబీఐ దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌ను మహారాష్ట్ర తోసిపుచ్చింది. దీంతో కొందరు సుప్రీంను ఆశ్రయించారు. సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించాలని కొందరు రాజకీయ ప్రముఖులు సైతం డిమాండ్ చేశారు. సుశాంత్ మృతిపై పలువురు డాక్టర్లు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని హత్య చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసులో సేకరించిన వివరాలన్నింటిని కూడా సీబీఐకు అప్పగించాలని మహరాష్ట్ర పోలీసుల్ని ఆదేశించింది. మరోవైపు మహా సర్కార్‌ను కూడా ఈ కేసు విషయంలో సీబీఐకు సహకరించాలని కోరింది. అవసరం అనుకుంటే కొత్తగా కేసు నమోదు చేసే అవకాశం కూడా సీబీఐకు కల్పించింది న్యాయస్థానం. మరోవైపు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల పట్ల సుశాంత్ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు సత్వర న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నామని సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది వికాశ్ సింగ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. న్యాయస్థానంపై ప్రజలకున్న నమ్మకాన్ని బలోపేతం చేసిందని, సుశాంత్ మృతి కేసులో న్యాయం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చిందని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే పేర్కొన్నారు.

Related posts