telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

లోక్ పాల్ పై.. కేంద్రానికి సుప్రీం కోర్టు చురక.. సభ్యుల నియామకంపై ఆదేశం..

supreme court two children petition

అన్నా హజారే లోక్ పాల్ సభ్యుల నియామకాల కోసం దీక్ష చేప్పట్టిన విషయం తెలిసిందే. మరి ఈ దీక్ష పుణ్యమో, సుప్రీం కోర్టు హెచ్చరికలతో కదిలిందో గాని, కేంద్రం లోక్ పాల్ పై మరో అడుగు ముందుకేసింది. ఈ నెలాఖరులోగా లోక్‌పాల్‌ సభ్యులను నియమించాలని కేంద్రం భావిస్తోంది. లోక్‌పాల్‌ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఛైర్మన్‌, ఇతర సభ్యుల నియామకం కోసం గురువారం నుంచి 22 వరకూ ఈ కమిటీ దరఖాస్తులు స్వీకరిస్తుందని వెల్లడించింది, అనంతరం వీటిని పరిశీలించి ఉన్నతస్థాయి కమిటీకి పంపిస్తుంది.

లోక్‌పాల్‌ నియామకంపై ఎంపికకమిటీ అనుసరిస్తున్న ధోరణిపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌పాల్‌ ప్యానెల్‌ కమిటీ సభ్యుల పేర్లను సిఫారసు చేయాల్సిందిగా న్యాయస్థానం ఎంపిక కమిటీకి గడువు విధించింది. సభ్యులను ఎంపిక చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, సిబ్బందిని ఏర్పాటుచేయాలని సుప్రీం చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గొగోయల్ తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి ఏడవ తేదీకి వాయిదావేసింది.

నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి అదికారంలోనికి రావడానికి అన్నాహజారే దీక్ష తోడ్పడిందనే చెప్పాలి. అవినీతి అంతు చూస్తానన్న నరేంద్రమోడీ నాలుగున్నరేళ్లపాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేకపోయారు. గుజరాత్‌ సీఎంగా ఉన్న కాలంలో ఆరాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించలేదు. ఇపుడు లోక్‌పాల్‌పై సాక్షాత్తూ సుప్రీం చురకలు వేయడంతో ఇపుడు మోడీ ప్రభుత్వానికి లోక్‌పాల్‌ నియామకం అనివార్యం అయింది.

Related posts