telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్య భూవివాదంపై.. ఆగస్ట్‌ 15న సుప్రీం విచారణ

supreme court two children petition

వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం పై చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఆగస్ట్‌ 15న సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

మధ్యవర్తిత్వ కార్యకలాపాలను కెమెరాలో రికార్డు చేయాలని, ఈ వివాదంలో వివిధ పార్టీలు ఈ ఎనిమిది వారాల డెడ్‌లైన్‌ను ఉపయోగించుకుని విచారణకు సన్నద్ధం కావాలని కోర్టు కోరింది.ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించామనే అంశాన్ని ఎవ్వరికీ చెప్పబోం.. అది గోప్యంగా ఉంచబడుతుందని సీజేఐ స్పష్టం చేశారు. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదంపై సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

Related posts