telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టులో నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం

Supreme Court

సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ క్రిష్ణమురారీ, జస్టిస్‌ శ్రీపతి రవీంద్ర భట్‌, జస్టిస్‌ వీ రామసుబ్రమణ్యన్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకుంది. కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మరో రెండు కోర్టు హాళ్లు ఏర్పాటు చేశారు. 16, 17 కోర్టు హాళ్లను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి 16 ధర్మాసనాల్లో కేసుల విచారణ జరుగుతుంది.

ప్రమాణ స్వీకారం చేసిన వారైలో జస్టిస్‌ కృష్ణమురారీ పదవీ కాలం 2023 జులై 8వ తేదీ వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతారు.జస్టిస్‌ రవీంద్రభట్‌. జస్టిస్‌ వీ రామసుబ్రమణ్యన్‌ 2023 అక్టోబర్‌ 23వ తేదీ వరకు సుప్రీంకోర్టు బడ్జీ పదవిలో కొనసాగనున్నారు. తమిళనాడు కు చెందిన జస్టిస్‌ వీ రామసుబ్రమణ్యన్‌సు ప్రీకోర్టు న్యాయమూర్తిగా 2023 జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగనున్నారు. అలాగే జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు విధులు నిర్వహించనున్నారు.

Related posts