telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఎన్నికల సమయంలో మరో భారీ ఆఫర్ : మందు, చిందు.. అదికూడా పాఠశాలకు దగ్గరైన ఉండొచ్చన్న .. సుప్రీం కోర్టు… 

supreme court two children petition
ఎన్నికల సందర్భంగా అనేక తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం, కానీ మందుబాబులకు అనుకూలంగా తీర్పులు వెలువరించేట్టుగా ప్రభుత్వాలు చేయడం ఈ దేశంలో ఇంకో స్థాయి గొప్ప పరిణామం. బార్లలో మందు, చిందు ఉండొచ్చట; ఇక ఆ బార్లు పాఠశాలకు దగ్గరగానే ఉన్న పరవాలేదట.. ఇంతగొప్పగా మందు ప్రపంచాన్ని వ్యాపింపచేస్తున్న ప్రభుత్వాలకు జోహార్లు. అలాంటి పార్టీలకు అధికారం కట్టబెట్టాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇక ప్రస్తుత అద్భుత ఘటన గురించిన వివరాలలోకి వెళితే, మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్లకు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. డ్యాన్స్ బార్లపై అక్కడి ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను కొట్టేసింది. బార్లలో మందు, చిందు కలిసి నడవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని డ్యాన్స్ బార్లు ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ముంబైలో ఇది కుదరదని, దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. 
ఇంకా, బార్ల‌లో సీసీటీవీలు ఖచ్చితంగా ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిబంధ‌న‌ను కూడా కోర్టు కొట్టేయ‌డం విశేషం. ఈ బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్స్ ఇవ్వాలి తప్ప.. వాళ్లపై డబ్బు వెదజల్లకూడదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు బార్ రూమ్స్, డ్యాన్స్ ఫ్లోర్ మధ్య గోడ ఉండాలన్న నిబంధనను కూడా సుప్రీం కొట్టేసింది. ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కిలో మీటర్ దూరంలో బార్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సవాలు చేస్తూ ఈ బార్ల యజమానులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇది కుదరదని వాళ్లు వాదించారు. 2016లో ఈ డ్యాన్స్ బార్లపై కఠిన నిబంధనలు విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. డ్యాన్స్ చేసే ప్రదేశాల్లో మద్యం సరఫరా ఉండకూడదని, బార్లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలన్న నిబంధనలు ఇందులో ఉన్నాయి. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు కూడా విధించాలని ఈ చట్టంలో చేర్చారు. ఇప్పటి కోర్టు తీర్పుతో ఆ నిబంధనలకు తిలోదకాలు వదిలినట్టే. ఇక ఇష్టానుసారంగా, ప్రభుత్వం-మద్యం వ్యాపారులు వారి దందా చేసుకోవచ్చు. ఏకంగా పాఠశాలలోనే మందు అమ్ముకోవచ్చు.. శభాష్ భారతీయులారా.. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గర్వపడండి. 

Related posts