telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సుప్రీం కోర్టులో జగన్‌ ప్రభుత్వానికి షాక్‌… పంతం నెగ్గించుకున్న నిమ్మగడ్డ

Nimmagadda ramesh supreme court

సుప్రీం కోర్టులో జగన్‌ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఏపీ పంచాయతీ ఎన్నికలపై గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇవాళ సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల వాయిదా పిటిషన్లపై విచారించిన సుప్రీం కోర్టు… స్థానిక సంస్థల ఎన్నికలను ఆపడం కుదరదని తేల్చి చెప్పింది. ఏదీ ఏమైనా ఎన్నికలు జరపాల్సిందేనని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు… ప్రభుత్వం, ఎన్జీవో సంఘల పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా కుదరదని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు… ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలను మందలించింది అత్యున్నత న్యాయస్థానం. ఇక సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఏపీలో షెడ్యూల్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.

Related posts