telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు పై .. మండిపడ్డ కోర్టు.. లక్ష జరిమానా..

సుప్రీంకోర్టు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తీరు ఏ మాత్రం సరిగా లేదంటూ చీవాట్లు పెట్టి, అంతటితో ఊరుకోకుండా ఆయనపై లక్ష రూపాయల జరిమానా విధించింది. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ అధికారులను బదిలీ చేయడం ఆక్షేపణీయమని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వేళ, ఎవరినీ బదిలీ చేయరాదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని స్వయంగా తాము హెచ్చరించినా, ఆయన పెడచెవిన పెట్టారని గుర్తు చేసింది.

ముజఫర్ పూర్ స్టేట్ హోమ్ కేసులో విచారణ జరుపుతున్న అధికారిని బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాన్ని ఆయన వివరించలేదని, బదిలీలు వద్దన్నా చేపట్టడం కోర్టు ధిక్కరణేనని పేర్కొంటూ, ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు వెల్లడించింది. కోర్టు సమయం ముగిసేంత వరకూ ఆయన చీఫ్ జస్టిస్ గదిలోనే ఉండాలని ఆదేశించింది.

Related posts