telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజినీకాంత్‌కు మరోసారి అస్వస్థత.. అభిమానుల్లో టెన్షన్ టెన్షన్..

Rajinikanth actor

సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ జీవిత కథను తెరకెక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, రజినీకాంత్‌ అభిమాని అయిన లింగుస్వామి సూపర్‌స్టార్ బయోపిక్‌ ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో రజినీకాంత్‌గా ఆయన పెద్దల్లుడు ధనుష్ నటించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలినాళ్లలో బస్ కండక్టర్‌గా పని చేసిన రజినీకాంత్ కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగన్‌గల్‌’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా… రజినీకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.  సినిమా సినిమాకు మధ్య గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, సినిమా రంగంతో పాటుగా రాజకీయాల్లోకి రావాలని చాలాకాలంగా అనుకుంటున్నారు.  డిసెంబర్ నెలలో తన పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటె, రజినీకాంత్ ప్రస్తుతం తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు.  చెన్నై సమీపంలోని ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు.  రజినీకాంత్ జ్వరంతో బాధపడుతున్నారని తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  కరోనా సోకిందేమో అని భయపడుతున్నారు.  రజినీకాంత్ కి సోకింది సాధారణ జ్వరమే అని త్వరలోనే కోలుకొని అభిమానుల ముందుకు వస్తారని కుటుంబసభ్యులు చెప్తున్నారు.  

Related posts