telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ విషయంలో చేసిన తప్పును వెంటనే దిద్దుకున్న మహేష్..

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విషెస్ చెబుతూ అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే..నేడు ప్రభాస్ 41వ జన్మదినం సందర్బంగా కొద్దిరోజుల ముందు నుంచే డార్లింగ్ ఫ్యాన్స్  సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో ట్రెండింగులోకి తీసుకొచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు యంగ్ రెబల్ స్టార్ కు పెద్దఎత్తున విషెస్ చెబుతున్నారు. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘అర్జున్’ సినిమా ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అయితే మహేష్ ఓ చిన్నపొరపాటు చేసినట్లు గుర్తించి వెంటనే సరి చేస్తూ మరొక ట్వీట్ చేశాడు. మహేష్ తొలిసారి ట్వీట్ చేసినప్పుడు ప్రభాస్ ఐడికి బదులుగా వేరొకరి ఫేక్ అకౌంట్ అడ్రస్ తో ట్యాగ్ చేశాడు. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే వేరొకరి పేరును చూపిస్తోంది. దీంతో కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న మహేష్ ఆ ట్యాగ్ ను తీసేశాడు. నిజానికి ప్రభాస్ కు ట్వీటర్ అకౌంట్ లేకపోవడం వల్లే ఇలా జరిగుంటుంది . ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తుండగా.. మహేష్ ‘సర్కారు వారిపాట’లో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Related posts