telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్‌ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి పూరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పూరీకి సూపర్ స్టార్ మహేష్ బాబు విషెస్ చెప్పాడు. “నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశాడు. మహేష్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో థ్రిల్ అవుతుంటారు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ వంటి సూపర్‌హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘జనగణమణ’ సినిమా ఆగిపోయింది. దీంతో వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉండగా, పూరిజగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో “ఫైటర్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది.

Related posts