telugu navyamedia
సినిమా వార్తలు

“సూపర్ డీలక్స్” సినేమానా..!? అసలు భరించలేకపోయాను… ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్

Super-Deluxe

సినిమా హిట్టయినప్పుడు ఆ సినిమాపై ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్ ఎవరైనా నెగెటివ్ గా స్పందిస్తే నటీనటులు తప్పకుండా బాధపడతారు. ఇటీవల విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించిన “సూపర్ డీలక్స్” విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో, రమ్యకృష్ణ వేశ్య పాత్రలో, సమంత ఓ విభిన్నమైన పాత్రలో కన్పించారు.

తాజాగా “సూపర్ డీలక్స్” చిత్రంపై ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం కామెంట్స్ చేశారు. “నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్‌ డీలక్స్’.. ఇది సినిమానా.. ఓ గాడ్‌.. అసలు భరించలేకపోయా” అంటూ ట్వీట్ చేశారు. నటరాజన్ కు స్పెషల్ గా అభిమానులు ఉండడంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి “సూపర్ డీలక్స్” సినిమా అందరికీ నచ్చలేదు. నచ్చనివాళ్ళు చూసి సైలెంట్ అయ్యారు. మరికొందరు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమా నచ్చినవాళ్ళు మాత్రం ఇలా నీచంగా కామెంట్స్ చేయడమేంటని నటరాజన్ ట్వీట్ పై మండిపడుతున్నారు. నటరాజన్ కామెంట్స్ పై సమంత బాధపడినట్లు సమాచారం. గతంలో సమంత నటించిన “అఆ” చిత్రానికి నటరాజన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

Related posts