telugu navyamedia
సినిమా వార్తలు

హృతిక్ రోషన్ “సూపర్ 30″కి సమస్యలు

Super-30

ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన గ‌ణిత మేధావి ఆనంద్‌కుమార్ బ‌యోపిక్‌ “సూప‌ర్ 30” టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హృతిక్ రోష‌న్ టైటిల్ పాత్రలో న‌టించారు. జూలై 12న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభ‌మ‌య్యిందో ఏమో కానీ.. చాలా అడ్డంకులే ఎదురయ్యాయి. తాజాగా విడుద‌ల‌కు సిద్ధమైన ఈ సినిమాకు మ‌రో అడ్డంకి ఎదురైంది. ఐఐటీ చ‌ద‌వాల‌నుకున్న పేద విద్యార్థుల‌కు ఆనంద్‌కుమార్ కోచింగ్ సెంట‌ర్ పెట్ట‌డ‌మే సినిమా ప్ర‌ధాన క‌థాంశం. అయితే ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాలు ఐఐటీ విద్యార్థ‌ల మ‌నోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయ‌ని గౌహ‌తికి చెందిన న‌లుగురు విద్యార్థులు హై కోర్టులో కేసు వేశారు. కోర్టు “సూప‌ర్ 30” ద‌ర్శ‌కుడు వికాస్ భ‌ల్ స‌హా నిర్మాత‌ల‌కు నోటీసులు జారీ చేసింది. మ‌రి దీనిపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts