telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సన్నీ కూతురు బర్త్ డే… ఎలా సెలబ్రేట్ చేసిందంటే ?

Sunny

శ‌ృంగార తార సన్నీలియోన్ ఐటమ్ సాంగ్‌లతో, కైపెక్కించే చూపులతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన మధురానుభూతులను షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంలో వరుసగా విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలకు కుంగిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సన్నీలియోన్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ చిత్రాలలో కూడా నటిస్తోంది. నటిగా రాణిస్తూనే వాణిజ్య ప్రకటనలతో సైతం సన్నీ బిజీగా మారిపోయింది. సన్నీలియోన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫోటో వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన “అర్జున్‌ పాటియాలా”లో మెరుపులా మెరిసిన సన్నీలియోనీ ప్రస్తుతం “స్ల్పిట్స్‌ విల్లా సీజన్‌ 12” రియాల్టీ షోతో బిజీగా ఉన్నారు. హర్రర్‌, కామెడీ నేపథ్యంతో సాగే “కోకాకోలా” సినిమాలో కూడా నటించనున్నారు. కాగా సన్నీ లియోన్ 2017 జూలైలో 21 రోజులున్న నిషా కౌర్‌ అనే చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుండి ఆ పాప ఆల‌నా పాల‌న చూసుకుంటూ ప్ర‌తి ఏడాది నిషా బ‌ర్త్‌డేని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు. సోమ‌వారంతో నిషా నాలుగో వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా స‌న్నీ లియోన్, డానియ‌ల్ వెబ‌ర్‌లు త‌మ‌ ముద్దుల కూతురి బ‌ర్త్‌డేని సరికొత్త థీమ్‌లో జ‌రిపారు. బ‌ర్త్ డేకి సంబంధించిన ఫోటోల‌ని వారు త‌మ సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. అంతేకాదు పాప కోసం చేసిన షాపింగ్‌కి సంబంధించిన ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. నిషా కౌర్‌ని మహారాష్ట్రలోని లాతూర్ నుంచి దత్తత తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 2011లో సన్నీ, వెబర్‌లు పెళ్లి పీట‌లెక్క‌గా ఇటీవ‌ల స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చారు. ఆ పిల్ల‌ల‌కి ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టారు. ముగ్గురు పిల్ల‌ల‌తో మా ఫ్యామిలీ ప‌రిపూర్ణ‌మైంది. త‌క్కువ స‌మ‌యంలో మాకింత పెద్ద ఫ్యామిలీ ఇచ్చిన దేవుడికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు అని స‌న్నీ లియోన్ ఆ మ‌ధ్య త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Related posts