telugu navyamedia
సినిమా వార్తలు

నిర్మాతలు చేసిన నిర్వాకం… సారీ చెప్పిన సన్నీ లియోన్

Sunny-Leone

బాలీవుడ్ హాట్ హీరోయిన్ స‌న్నీ లియోన్ న‌టించిన తాజా చిత్రం “అర్జున్ ప‌టియాలా”. స‌న్నీ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటులు దిల్జీత్‌ దొసాన్జ్‌, వరుణ్‌ శర్మ, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో క‌నిపించారు. జూలై 26న చిత్రం విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే చిత్రంలోని ఓ స‌న్నివేశంలో స‌న్నీ త‌న‌కి కాల్ చేయ‌మ‌ని దిల్జీత్‌కి ఫోన్ నెంబ‌ర్ ఇస్తుంది. అదే స‌న్నీ ఒరిజిన‌ల్ నెంబ‌ర్ అనుకొని భావించిన జ‌నాలు ఆ నెంబ‌ర్‌కి వ‌రుస కాల్స్ చేయ‌డం మొద‌లు పెట్టార‌ట‌. సినిమాలో స‌న్నీ చెప్పిన ఫోన్ నెంబ‌ర్ ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్‌ అగర్వాల్‌ది. దీంతో ఆయ‌న‌ని జ‌నాలు వ‌రుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల‌తో ఇబ్బంది పెడుతున్నార‌ట‌. సినిమా విడుదలైన రోజు నుంచి వందలాది ఫోన్‌ కాల్స్ వస్తుండడం… సన్నీ లియోన్‌తో మాట్లాడాలంటూ అడుగుతుండడంతో అతడు విసుగెత్తిపోయాడు. మరికొందరైతే అతడితో అసభ్యంగా మాట్లాడుతుండడంతో తట్టుకోలేక ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. “జూలై 26న సినిమా విడుదలైన తర్వాత గుర్తుతెలియన వ్యక్తుల నుంచి సన్నీ లియోన్ గురించి అడుగుతూ నాకు ఫోన్స్ మొదలయ్యాయి. తొలుత ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. అయితే అర్జున్ పాటియాలా సినిమాలో సన్నీ లియోన్ ఫోన్ నంబర్ అంటూ నిర్మాతలు నా నంబర్ ఇచ్చినట్టు తెలిసింది. చాలా మంది నాకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. కొందరైతే బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. మంగళవారమే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు” అని పునీత్ పేర్కొన్నాడు. తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రోజుకు 100 నుంచి 150 ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ… పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తానని సదరు యువకుడు పేర్కొన్నాడు. కాగా పునీత్ ఎదుర్కొంటున్న పరిస్థితిపై సమాచారం అందుకున్న సన్నీ లియోన్ అతడికి క్షమాపణ చెప్పింది. “క్షమించండి.. మీకిలా అవుతుందని నేను ఊహించలేదు. కొంతమంది ఆసక్తికరమైన వ్యక్తులు ఫోన్ చేస్తారు చూడండి…” అంటూ ఓ ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొంది. సాధారణంగా చిత్ర నిర్మాతలు సినిమా అవసరాల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను రిజిస్టర్ చేసి ఉపయోగిస్తారు. లేదా ఎవరూ వాడని ఓ నంబర్‌ను సినిమాలో ప్రదర్శిస్తారు. కానీ అర్జున్ పాటియాలా సినిమా నిర్మాతలు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Related posts