telugu navyamedia
సినిమా వార్తలు

సన్నీ లియోన్ “హ్యాండ్ కఫ్ ఛాలెంజ్”… సోషల్ మీడియాలో వైరల్

Sunny-leone

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఐస్ బకెట్ ఛాలెంజ్, 10 ఇయర్స్ ఛాలెంజ్ లు ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. 10 ఇయర్స్ ఛాలెంజ్ లో భాగంగా సెలెబ్రిటీలు పదేళ్ల కిందట తమ ఫోటోలను, ఇప్పటి ఫోటోలను పోస్ట్ చేయాలి. చాలామంది చేశారు కూడా. తాజాగా మరో కొత్త ఛాలెంజ్ తెరపైకి వచ్చింది. “హ్యాండ్ కఫ్ ఛాలెంజ్”… ఈ ఛాలెంజ్ లో భాగంగా భార్యాభర్తలు గానీ, ప్రేమికులు గానీ తమ చేతికి బేడీలు వేసుకుని రోజువారీ పనులను చేసుకుంటూ… దానిని వీడియో తీయాలి. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి ఈ “హ్యాండ్ కఫ్ ఛాలెంజ్” స్వీకరించారు. డేనియల్ తో కలిసి జాగింగ్, ఎక్సర్ సైజు చేస్తున్న వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేసింది సన్నీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Related posts