telugu navyamedia
సినిమా వార్తలు

విశాల్ తో చిందేయనున్న శృంగార తార

Sunny-leone

కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన “టెంపర్” రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి “అయోగ్య” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశాల్ తో బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ చిందేయనుంది. విశాల్ ఇటీవలే తన పెళ్ళి ప్రకటన చేసి తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సన్నీ లియోన్ హిందీలోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో మెరిసింది. ఇక “మహాదేవి” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో కన్నడిగులను పలకరించడానికి సిద్ధమవుతోంది ఈ హాట్ బ్యూటీ. కానీ కన్నడ ప్రజలు మాత్రం వీర మహాదేవి పాత్రను సన్నీ పోషించడానికి ఒప్పుకోవడం లేదు. మరి సినిమా విడుదల సమయంలో ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చూడాలి.

Related posts