telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వ్యక్తిని కాపాడుకోలేకపోయాను… కన్నీటి పర్యంతమైన సన్నీ

Sunny-Leone

బాలీవుడ్ బుల్లితెరపై ప్రచారం అవుతున్న అర్భాజ్ ఖాన్ చాట్ షో “పించ్”లో పలువురు సెలబ్రెటీలు పాల్గొనడమే కాకుండా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాజాగా సన్నీలియోన్ కూడా ఈ షోలో పాల్గొని తన అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు. గతంలో సన్నీలియోన్ ఓ చిన్నపాప, ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఉన్నది ఎవరని సన్నీని అర్భాజ్ ఖాన్ ప్రశ్నించారు. ఈ ఫొటో గురించి చెబుతున్న సందర్భంలో సన్నీలియోన్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ ఫోటోపై స్పందిస్తూ సన్నీ “మా క్యాస్ట్ అండ్ క్రూ‌కు చెందిన వ్యక్తి ప్రభాకర్. నేను ఈ ఫొటో పోస్ట్ చేసే సమయానికి అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనిపైనే ఆధారపడి అతని తల్లి, భార్య, పిల్లలు జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. నా భర్త డానియల్, నేను అతనికి ఆర్థికంగా సాయపడ్డాం. అతని కిడ్నీలు 10శాతానికి తక్కువగానే పనిచేస్తున్నాయి. అతను కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తి అని నాకు తెలుసు. అతని వైద్య ఖర్చుల కోసం విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో ఆ ఫొటోతో కూడిన పోస్ట్ పెట్టాను. అతని కోసం మేం చాలా చేయాలనుకున్నాం. కానీ ఏమీ చేయలేకపోయాం. అతను చనిపోయాడు” అని సన్నీలియోన్ కన్నీటి పర్యంతమయింది. అయితే ఇక్కడ ఆమె చేసిన పోస్ట్ కు ఎవరూ స్పందించకపోగా సన్నీలియోన్‌నే తీవ్రంగా విమర్శించారు.

Related posts