telugu navyamedia
క్రీడలు వార్తలు

కుల్దీప్ కు అవకాశం ఉంది అని చెప్పిన గవాస్కర్…

sunil gavaskar on bcci

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్‌టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు అండగా రాణించడంలో నదీమ్‌, అశ్విన్ విఫలమయ్యారు. నదీమ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి తీసుకురాలేకపోయాడు. దీంతో అతని స్థానంలో కుల్దీప్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘కాస్త వైవిధ్యంగా బంతులు విసిరే కుల్దీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఆఫ్‌ స్పిన్నర్లు. అశ్విన్ గాల్లో నెమ్మదిగా బంతులు వేస్తే, సుందర్ వేగంగా విసురుతాడు. కాబట్టి నదీమ్‌/సుందర్‌ స్థానాల్లో కుల్దీప్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 85 నాటౌట్ పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన సుందర్‌ను తప్పించలేరు. అయితే ఎవరు జట్టులోకి వచ్చినా ఇంగ్లండ్‌ను తక్కువస్కోరుకే కట్టడి చేయడానికి ప్రయత్నించాలి” అని గవాస్కర్ సూచించాడు. ‘తొలి టెస్టులో నదీమ్ కాస్త భయపడ్డాడు. అతని బౌలింగ్‌ను ఉద్దేశించి చెప్పట్లేదు. అతను వేసిన నో బాల్స్‌ గురించి మాట్లాడుతున్నా. స్పిన్‌లో ఆత్రుతతో బంతులు వేయాలనుకున్నప్పుడే క్రీజును దాటుతుంటారు. అశ్విన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నో ఏళ్ల తర్వాత అతను నోబాల్స్‌ వేశాడు. టీమిండియా వీటిపై దృష్టిసారించాలి” అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Related posts