telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సునీల్ బ్యాక్.. మళ్ళీ స్టార్ కమెడియన్ గా..

sunil back as star comedian

సునీల్ హాస్య నటుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన తెరపై కనిపించగానే పక్కున నవ్వే స్థాయికి ఎదిగి ఒక స్థాయిలో స్టార్ కమెడియన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తనదైన టైమింగ్ తో .. మేనరిజంతో ఆయన దూసుకుపోయాడు. ఆ తరువాత హీరోగా అడుగులు వేసిన ఆయనని ఆరంభంలో విజయాలు పలకరించినా .. ఆ తరువాత ముఖం చాటేశాయి. దానితో కొన్నాళ్ళు అవకాశాలు లేకపోవటం; మళ్లీ ఆయన కమెడియన్ గానే కెరియర్ ను కొనసాగించాలనే సలహాను మిత్రబృందం, అభిమానుల కోరికతో తెరపై తళుక్కుమంటున్నాడు.

అయితే అప్పటి క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా, ప్రేక్షకుల నుండి తనకు ఇంకా ఆదరణ పెరిగింది. క్రితం ఏడాది ‘అరవింద సమేత’ చిత్రం ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా వున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘చిత్రలహరి’లో ఆయన కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరో మూడు సినిమాలు సెట్స్ పైనే వున్నాయి. ఇక బన్నీ హీరోగా రూపొందించే సినిమాలోను సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ ను డిజైన్ చేశాడట. ఇలా మళ్ళీ సునీల్ హాస్యనటుడిగా దూసుకుపోతున్నాడు.

Related posts