telugu navyamedia
రాజకీయ

రాష్ట్రపతికి ఎంపీల జాబితా అందజేత

No chance for EVM Tamparing: CEC

16వ లోక్‌సభను కేంద్ర మంత్రివర్గం సూచన మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శనివారం రద్దు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాలు సొంతంగా గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారపీఠం ఎక్కనుంది. కేంద్ర కేబినెట్‌ నిన్న సమావేశమై 16వ లోక్ సభను రద్దు చేసేలా సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 17వ లోక్‌సభకు ఎన్నికలు పూర్తి కావడంతో కేబినెట్ తీర్మానంతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా నేడు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా  ఎన్నికైన ఎంపీల జాబితాను సునీల్‌ అరోరా రాష్ట్రపతికి అందజేశారు.

Related posts