telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లిదండ్రులకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో

Sandeep

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్. సందీప్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తున్నారు. అడ‌పాద‌డ‌పా నిర్మాత‌గాను త‌న అదృష్టం ప‌రీక్షించుకుంటూ వ‌స్తున్నాడు. సందీప్ నిర్మించిన నిను వీడ‌ని నీడ‌ను నేనే అనే చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న నిర్మాణంలో మ‌రిన్ని సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. సందీప్ రీసెంట్‌గా తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్‌తో పాటు “ఏ1 ఎక్స్‌ప్రెస్” అనే సినిమాలో న‌టిస్తున్నారు. హాకీ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే సందీప్ తాజాగా తన త‌ల్లిదండ్రుల‌కి మంచి లగ్జ‌రీ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ 350డి కారును అందుకున్న సందీప్ అమ్మనాన్నలు కనకదుర్గ, పీఆర్పీ నాయుడు చాలా సంతోషించారు. ఈ కారు ధర సుమారు రూ.90 లక్షలు ఉంటుంది.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts