telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

సీజన్ మారినా తగ్గని ఎండలు.. మరో 4 రోజులు భానుడి భగ భగ

this summer exceeds 47 degress and more

వర్షాకాలం ఆరంభమైనప్పటికీ వరుణుడు కరుణించడం లేదు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో హైదరాబాద్ నగరంలో జూన్‌ నెలలోనూ ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు లేవని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సముద్రం నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైనట్లు తెలిపింది. కాగా మంగళవారం నగరంలో గరిష్టంగా 37.7 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మండుటెండల కారణంగా బోరుబావుల్లో జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఇళ్లలో గార్డెనింగ్‌ అవసరాలకు సైతం నీటికొరత తీవ్రంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న నల్లానీరు ఏమూలకూ సరిపోకపోవడంతో అధిక డబ్బులు చెల్లించి ప్రైవేటు ట్యాంకర్‌ ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు.

Related posts