వార్తలు & టిప్స్

వేసవి కాలంలో జుట్టు సమస్యలకు పరిష్కారాలివే…

వేసవికాలం ప్రారంభమవడంతో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఎండలు ఎక్కువగా ఉండడం, మారుతున్న వాతావరణం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ ఎండల ప్రభావం చర్మం, కళ్ళు, వెంట్రుకలపై పడుతుంది. అందువల్ల ఎండాకాలంలో చర్మ సౌందర్యానికి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెంట్రుకల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

* వేసవిలో ఎండలకు వెంట్రుకలు, మాడు జిడ్డుగా మారతాయి. దానివల్ల జుట్టు దురద రావచ్చు. అందుకే తరచుగా తలస్నానం చేస్తుండాలి.

* ఎక్కువసేపు ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీని లేదా క్లాత్ ను ధరించడం మంచిది. అంతేకాదు వేడి ఎక్కువగా ఉంటే వెంట్రుకలు చిక్కులు పడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం వెంట్రుకలు చిక్కులు పడకుండా చూసే నూనెలను తలకు రాసుకోవచ్చు.

* ఎండాకాలంలో వేడినీటితో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు పొడిబారతాయి. అందుకే చల్లటి నీటితో స్నానం చేయడం ఉత్తమం.

* ఎండకు ప్రభావితమైన వెంట్రుకలకు కండిషనర్ ను రాసి, కొద్దిసేపు షవర్ క్యాప్ ధరించి, ఆ తరువాత తల స్నానం చేయాలి.

* ఇక జుట్టుకు రంగేయాలంటే ముందుగా గుర్తొచ్చేది హెన్నా. సహజసిద్ధంగా దొరికే వాటితో జుట్టుకు రంగేయడం వల్ల జుట్టు అన్ని కాలాల్లో సహజంగా మెరుస్తూ ఉంటుంది.

* రెండు స్పూన్ల కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించి చల్లారాక జుట్టుకు స్ప్రే చెయ్యాలి. తరువాత మసాజ్ చేసి గంట తరువాత కడిగేసుకుంటే జుట్టు సహజంగా నల్లగా మారిపోతుంది.

*ఇక ఎండాకాలంలోనే కాదు ఏ కాలంలో అయినా సరే బైక్ పై ఎక్కడికైనా వెళ్ళాలంటే హెల్మెట్ ధరించాల్సిందే. కానీ ఎండాకాలంలో హెల్మెట్ ధరించడం చిరాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గంటకోసారి హెల్మెట్ ను తీసి జుట్టును మర్దనా చేస్తుండడం, హెల్మెట్ ను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

Related posts

మీది ఏ రకమైన చర్మమో తెలుసుకోండి

admin

వేసవిలో రక్షణకు పుచ్చకాయ చేసే మేలు

admin

చుండ్రు తొలగించడానికి చిట్కాలు….!

admin

Leave a Comment