telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వేసవిలో దొరికే ఆహారంతో.. ఆరోగ్యం, సౌందర్యం కూడా .. తెలుసా.. !

summer food is good for health and beauty

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి, దీనితో కాస్త చల్లగా ఉండే ఆహారం తీసుకోవాలని అందరూ చూస్తున్నారు. అయితే ఈ కాలంలో పలు పదార్దాలు, కూరగాయలు, పండ్ల రూపంలో లభ్యమవుతూనే ఉన్నాయి. అవి తీసుకోవడం వలన ఈ వేసవి తాపం నుండి రక్షణ కలగటంతో పాటుగా ఎండలకు చర్మం మాడిపోకుండా చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఇక అందులో ప్రముఖంగా అందరికి లభ్యమయ్యేది కీరదోస. శరీరానికి చల్లదనంతో పాటు చర్మ సంరక్షణను అందించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలా అధికంగా ఉన్నాయి. వేసవి కాలంలో కీరదోసతో ఉపశమనం పొందడమే కాదు ఆరోగ్యాన్నీ రెట్టింపు చేస్తుంది.

వేసవి లో దాహార్తి తో శరీరంలో నీటి అవసరం పెరుగుతుంది, కీరదోస తినడం వలన ఈ సమస్య ఉండదు. అప్పుడే శరీరంలోని చెడు మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిల్లో కొద్దిగా ఉప్పు, కారం వేసి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తరచు తింటుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దానితో పాటు చర్మం ముడతలన్ని నివారిస్తుంది.

keera dosa water for summer helathవిటమిన్ ఎ, బి, సి, మెగ్నిషియం, పొటాషియం, సిలికాన్ వంటి మినరల్స్ కీరదోస లో అధిక మోతాదులో ఉంటాయి. కీరదోస ముక్కలను కంటిపై పెట్టుకుంటే.. కంటి అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. కీరదోస శరీర వేడిని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. ఎండ ప్రభావం కారణంగా చర్మం కందిపోతుంది. అలాంటప్పుడు కీరదోస ముక్కలతో చర్మం మీద మర్దన చేస్తే సాంత్వన లభిస్తుంది.

తరచు కీరదోస తింటుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. కీరదోసతో రోజూ తింటే.. అధిక రక్తపీడనం, అల్ప రక్తపీడనం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీనిలోని ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. సాధారణంగా జ్వరంగా ఉన్నప్పుడు నోరు చేదుగా ఉంటుంది. అలాంటప్పుడు కీరదోస ముక్కలు తింటే ఫలితం ఉంటుంది. తద్వారా శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.

Related posts