telugu navyamedia
సినిమా వార్తలు

జగన్ కు సుమంత్ ట్వీట్… కరెక్షన్ అంటూ మళ్ళీ ట్వీట్

Sumanth

2019 ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వై.ఎస్‌.జ‌గ‌న్‌ కు రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వ‌ర‌లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జ‌గ‌న్‌కు నాగార్జున‌, మ‌హేష్‌, ర‌వితేజ స‌హా హీరోలంద‌రూ ట్విట్ట‌ర్ వేదికగా అభినంద‌న‌లు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కినేని హీరో సుమంత్ ఈ నెల 23 “మా కొత్త సీం వైఎస్‌.జ‌గ‌న్‌గారికి అభినంద‌నలు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, అందులో జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు కాబ‌ట్టి సుమంత్ రెండు రోజుల త‌ర్వాత తన ట్వీట్‌ను క‌రెక్ష‌న్ అంటూ “న్యూ ఏపీ సీఎంగారు” అని జ‌గ‌న్‌ను సంబోధిస్తూ సవరించారు. ఇక జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Related posts