telugu navyamedia
సినిమా వార్తలు

వ‌ర్మ యాక్ష‌న్‌..హీరో రియాక్ష‌న్‌..!

క్లాల‌రీ ఇచ్చిన హీరో..|
అక్కినేని మ‌న‌వ‌డు సుమంత్ రెండ‌వ పెళ్లిపై వ‌చ్చిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఇటీవ‌ల సుమంత్ విడుద‌ల చేసిన పెళ్ళి కార్డు న్యూస్ వైర‌ల్‌ అయింది. అయితే దీనిపై పెళ్ళేంటే పెద్ద పెంట అంటూ.. రామ్ గోపాల్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే వ‌ర్మ కామెంట్‌పై స్పందించిన సుమంత్ ఓ క్లాల‌రీ ఇచ్చాడు. ఆ పెళ్ళి కార్డు త‌న‌దే అని, కాని రియ‌ల్ పెళ్ళి కార్డు కాద‌ని, అది ఓ సినిమా కోసం డిజైన్ చేసిన పెళ్ళి కార్డు అనిచెప్పారు. పెళ్ళి, విడాకులు అనే అంశం పై సినిమా చేస్తున్నాన‌ని, దానికి సంబంధించిన అప్‌డెట్ కూడా త్వ‌ర‌లో ఉంటుంద‌ని, నేను రెండో పెళ్ళి చేసుకోవ‌డం లేద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా ఓ విడియో విడుద‌ల చేశారు.

ఈ పెళ్ళి కార్డు ఎలా లీకైందో తెలియ‌దు..సెట్స్ మీద నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు. షో ఇప్ప‌టికైనా వ‌ర్మ‌కి ఓ క్లారిటీ వ‌చ్చంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రచ్చ అయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే..

Related posts