telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈసారి కూడా ఆ సెంటిమెంట్ నే నమ్ముకున్న సుకుమార్…!?

Sukumar

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో గుబురు గడ్డం పెంచమని చెప్పాడట క్రియేటివ్ దర్శకుడు. బన్నీ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడట. ఇటీవల బయటకు వచ్చిన బన్నీ ఫోటోలు కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోందట. శేషాచలం అడవుల నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు సగ భాగం అటవీ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేరళలోని అడవుల్లో షూటింగ్ చేయాలనుకున్నారు.  అయితే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్స్‌కి, కాంబినేషన్లకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిపోయారు దర్శకుడు సుకుమార్. స్వతహాగా ఎప్పుడూ గడ్డం పెంచుకుని ఉంటే సుక్కు..తన సినిమాలో హీరోలకి కూడా గడ్డం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ సినిమాలలో ఆయన స్టార్ హీరోలను గుబురు గడంతో చూపించారు. అవి రెండు కూడా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారట సుకుమార్.

Related posts