telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రౌడీతో సుకుమార్ సినిమా..?

vijay devarakonda

టాలీవుడ్‌‌లో వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు ఆసక్తి రేపే కథలతో వరుస సినిమాలను రూపొందుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒకదానితో మరొకటి పోటీ పడకుండా సోలోగా వచ్చేందకు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా విజయ్ దేవరకొండ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌తో సినిమాకి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతే సుకుమార్ కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సారి సుకుమార్ ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాను ఓకే చేశారు. అయితే విజయ్, సుకుమార్ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు.  సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప సినిమా ఆగస్ట్‌లో విడుదల కానుంది. విజయ్ లైగర్ సినిమా సెప్టెంబర్9న ప్రేక్షకుల ముందకు వస్తుంది. ఆ తరువాత వెంటనే అక్టోబర్‌లో విజయ్, సుకుమార్ సినిమా ప్రారంభం అవుతుందనుకుంటే తప్పే. సుకుమార్ కథ ఇంకా పూర్తి కాలేదంట. ఇంకా లైన్ మాత్రమే సిద్దం అయిందని సమాచారం. ఆ తరువాత ఈ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలి.

Related posts