telugu navyamedia
andhra news political

తమది వ్యాపార కుటుంబం కాదు: సుజనా చౌదరి

4 directors arrested from sujana chowdary offices

తమది వ్యాపార కుటుంబం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర సంగతులు వెల్లడించారు. తన తల్లిదండ్రుల వివరాలను అభిమానులతో పంచుకున్నారు. తాతగారు బ్రిటీష్ పాలనలో పోలీసాఫీసర్ అని వెల్లడించారు. ఆయన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలితరం ఐపీఎస్ అధికారుల్లో ఒకరిగా నిలిచారని తెలిపారు.

తన పూర్వీకుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదమద్దాలి అని చెప్పారు. తన తల్లి సుజన గారిది కంచికచర్ల వద్ద పున్నవరం గ్రామం అని సుజనా వివరించారు. తన తండ్రి జనార్దన్ నీటిపారుదల శాఖలో ఉద్యోగి అని, ఆయన రిటైరయ్యారని తెలిపారు. తమ పూర్వీకులు వ్యవసాయం చేసేవారని పేర్కొన్నారు. తన తల్లి సొంతూరు అయిన పున్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సుజనా వివరించారు.

Related posts

పల్నాడుని .. పట్టించుకోరా.. : చంద్రబాబు

vimala p

మోదీ విమానానికి పాక్‌ గ్రీన్ సిగ్నల్

vimala p

విశాఖ : .. అశ్విన్ ఖాతాలో .. టెస్టుల్లో అతివేగంగా 350 వికెట్లు తీసిన రికార్డు..

vimala p